Friday, April 26, 2024

నావల్నీకు ఇవి అంతిమ క్షణాలే: డాక్టర్లు

- Advertisement -
- Advertisement -

Alexei Navalny may die anytime in next few days

 

మాస్కో: రష్యాలో జైలు పాలయిన పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సి నావల్నీ వచ్చే కొద్ది రోజులలో ఎప్పుడైనా కన్నుమూయవచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. సరైన వైద్య చికిత్స మరింత అందుబాటులోకి రాకపోతే మరణం ఖాయం అవుతుందని రష్యాలో పుతిన్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన ఈ హక్కుల నేత డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి దశలో ఆయనకు జరిగిన రక్త పరీక్షలతో పరిస్థితి తీవ్రత తేటతెల్లం అయింది. ఎప్పుడైనా గుండెపోటుకు గురికావచ్చు. కిడ్నీలు పనిచేయకపోవచ్చు అని వైద్యులు తెలిపారు. పుతిన్‌విధానాలపై విమర్శలకు దిగుతూ వచ్చిన నావల్నీని ఫిబ్రవరిలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. తీవ్రస్థాయి వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో జైలులో సతమతమవుతున్నారు. ఇది ఇలా ఉండగా నావెల్ని జైలులో చావకుండా చూస్తాం లెండి అని బ్రిటన్‌లో రష్యా రాయబారి అక్కడి మీడియాతో వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News