Home కరీంనగర్ అల్గునూర్ చౌరస్తాను కెసిఆర్ ఐలాండ్‌గా తీర్చిదిద్దుతాం

అల్గునూర్ చౌరస్తాను కెసిఆర్ ఐలాండ్‌గా తీర్చిదిద్దుతాం

Algunur Chaurasta

 

తిమ్మాపూర్ : నవంబర్ 29, 2009వ సంవత్సరం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన రోజనీ, ఆ రోజున సీఎం కెసిఆర్ సిద్దిపేటలో ఆమరణ దీక్షకు వెళ్తున్న తరుణంలో ఆంధ్రా పోలీసులు ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసిన స్థలమైన అల్గునూర్ చౌరస్తాను సుందరంగా తీర్చిదిద్ది కేసీఆర్ ఐలాండ్‌గా నామకరణం చేస్తామని బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి అల్గునూర్ చౌరస్తాలో సీఎం పీఆర్వో గటిక విజయ్‌కుమార్ రచించిన ‘జ్వలిత దీక్ష’అనే పుస్తకాన్ని ఆయన ప్రారంభించారు.

గాంధీ సిద్ధాంతానికి పురుడుపోసిన ఊరు.. అల్గునూరు అని గాంధేయవాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమంలో ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ అచ్చుడో..’ అన్న నినాదంతో ఆమరణ దీక్షకు వెళ్తున్న ఆయన్ను అల్గునూర్‌లోని ప్రధాన చౌరస్తాలో అరెస్ట్ చేసిన విషయం, ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన వృత్తాంతాలను గుర్తు చేస్తూ చాలా బాగా ప్రస్తావించారన్నారు. తొలిదశలో సాధించలేకపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని మలిదశ ఉద్యమంలో గాంధేయమార్గంలో సాధించాలనే ఉద్దేశంతో ప్రస్తుత సీఎం కేసీఆర్ 2009వ సంవత్సరంలో ఉద్యమం చేపడితే రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు.

శాంతియుత పోరుతోనే రాష్ట్రం సాధ్యం : అల్లం నారాయణ
శాంతియుత పోరాటంలో సీఎం కేసీఆర్ పాలు పంచుకొని తెలంగాణ రాష్ట్ర సాధించడంలో గాంధేయవాదమే కీలకమనీ, గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఇక్కడ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. నాటి తెలంగాణ పోరాటం భవిష్యత్ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Algunur Chaurasta as KCR Island