Home తాజా వార్తలు కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఆలియాభట్‌

కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ఆలియాభట్‌

Alia Bhatt Act With NTR In Director Koratala Siva Movieహైదరాబాద్‌ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా వస్తోంది. ఈ సిినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియాభట్‌ నటించనున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆలియాభట్‌, ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ’ఆర్ఆర్ఆర్‘ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించేందుకు ఆలియాభట్‌ అంగీకరించినట్టు సమాచారం. ’ఆర్ఆర్ఆర్‘ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ కొరటాల శివ రూపొందించే సినిమా పట్టాలెక్కనుంది. కొరటాల శివ సినిమాలో ఆలియాభట్‌ నటించనుందన్న వార్తలపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించే సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించిన ‘జనతా గ్యారేజ్‌’ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొరటాల శివ రూపందించే ఎన్టీఆర్ రెండో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే నెల పట్టాలెక్కే అవకాశం ఉంది.