Home తాజా వార్తలు అందుకే ఓకే చెప్పింది

అందుకే ఓకే చెప్పింది

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా అలియాభట్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఈ యంగ్ బ్యూటీ ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉండొచ్చు అనే దాని గురించి జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం అలియాభట్‌కు అక్షరాలా 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట.

నిజానికి ఈ బ్యూటీ డిమాండ్‌కు ఇది చిన్న మొత్తం. దీని స్థానంలో ఏ హిందీ మల్టీస్టారర్ ఒప్పుకున్నా కూడా రెట్టింపు రెమ్యునరేషన్ వస్తుంది. మరి అలియా ఎందుకు ఒప్పుకుందనే సందేహం రావడం సహజం. దీనికి రెండు కారణాలు ఉన్నాయట. ఒకటి రాజమౌళి సినిమా కావడం. ఎందరో ఎదురు చూసే అవకాశం కోరి తన తలుపు తట్టింది. రెండోది తన పాత్ర. సీత పేరుతో ఉండే అలియాభట్ రోల్ సినిమా మొత్తం కనిపించనుందట. ఆమె పాత్ర అరగంట నుంచి నలభై నిమిషాల పాటు ఉంటుందని తెలిసింది.

Alia Bhatt gets high Remuneration for RRR