Home తాజా వార్తలు భారీ మల్టీస్టారర్‌కు సిద్ధం

భారీ మల్టీస్టారర్‌కు సిద్ధం

ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో సీతారామరాజుగా రామ్‌చరణ్ పాత్రను, భీమ్‌గా ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. స్వాతంత్రోద్యమానికి ముందు ఈ ఇద్దరు వీరులుగా రూపాంతరం చెందిన వైనం ఎలాంటిదో.. అప్పట్లో ఈ ఇద్దరు కలిసి ఆంగ్లేయులపై పోరాటం చేసి ఉంటే ఏం జరిగేదో ఊహించి తెరపై ఆవిష్కరిస్తున్నామని రాజమౌళి ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఇక ఈ సినిమాలో చరణ్ కథానాయిక సీత పాత్రలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్‌ను, ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ బ్యూటీ డైజీ ఎడ్గార్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరో స్వాతంత్య్ర సమరయోధుడిగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌ను ఎంపిక చేశారు. అయితే రాజమౌళి ఉత్తరాంధ్రలో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేశారు. అక్కడ జరిగే షూటింగ్‌లో పాల్గొనేందుకు అలియాభట్ సిద్ధమవుతోంది. అలాగే ఎన్టీఆర్ నాయిక డైజీ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొననుంది. ఉత్తరాంధ్రలోని పలు అందమైన లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరిస్తారు. ఇక భారీ బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Alia Bhatt ready for Joins in RRR movie Shooting