Home తాజా వార్తలు క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్‌కు సిద్ధం

క్రేజీ మల్టీస్టారర్ షూటింగ్‌కు సిద్ధం

Alia Bhatt

 

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్‌గా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రను పోషిస్తున్న రామ్‌చరణ్ కు జోడీగా మరదలు సీత పాత్రలో ఆమె నటించనుంది. ఇప్పటికే ఈ చిత్రం కొంత పార్ట్ చిత్రీకరణ కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అలియా భట్ షూటింగ్‌లో పాల్గొన్న దాఖలాలు అయితే కనిపించలేదు. ఎట్టకేలకు ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొనేందుకు అలియా సిద్ధమైంది. అతి త్వరలోనే అహ్మదాబాద్, పూణెలోని పలు లొకేషన్ల్‌లో చిత్రీకరణకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ తిరిగి వచ్చిన వెంటనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ఇక ఇదే సమయంలో రణబీర్ కపూర్‌తో హాలీడే ట్రిప్ కోసం ఫారిన్ వెళ్లిన అలియా తాజాగా ఇండియా వచ్చింది. త్వరలో ప్రారంభం కాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ కొత్త షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఆమె సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, అలియాభట్‌ల కాంబినేషన్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు పలు యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరిస్తారని తెలిసింది. దాదాపు రెండు నెలల పాటు ఈ షెడ్యూల్‌ను రాజమౌళి ప్లాన్ చేశారట. 2020 జులైలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ‘బాహుబలి’ స్థాయిలో ఉండేందుకు ఈ స్టార్ డైరెక్టర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Alia Bhatt to join the shoot of RRR in Pune and Ahmedabad