Home రాజన్న సిరిసిల్ల ప్రతి ఒక్కరి చేతుల్లో డెబిట్ కార్డులుండాలి

ప్రతి ఒక్కరి చేతుల్లో డెబిట్ కార్డులుండాలి

మంత్రి దత్తత గ్రామంలో కలెక్టర్ పర్యటన
Collector

గంభీరావుపేట: మంత్రి దత్తత గ్రామంలో ప్రతి ఒక్కరి చేతుల్లో డెబిట్ కార్డులుండాలని, నగదు ర హితంపై నిర్లక్షం తగదని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను హెచ్చరించారు. గురువా రం మంత్రి కెటిఆర్ దత్తత గ్రామమైన దేశాయిపేటలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. నగదు రహిత లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఎంత వ రకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకు న్నారు.

ముందుగా ఖాతాలు ఏ బ్యాంకులో ఉ న్నా పర్వాలేదు వారందరికి ఆయా బ్యాంకుల ద్వారా డెబిట్ కార్డులు అందించేందుకు త క్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. గ్రా మంలో వందశాతం నగదు రహిత లా వాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాల న్నారు. కాగా ముందునుంచే గ్రా మంలో అధికారులు పకడ్బందీ చర్య లు తీసుకున్నప్పటికీ బ్యాంకుల సిబ్బంది బిజీగా ఉండడం వలన ఖాతాలు తీయడం సాధ్యం కాకపోయే సరికి కో ఆపరేటివ్ బ్యాంకు ఖాతాలు ఇవ్వడంతో పాటు అందరికీ డెబిట్ కా ర్డులు అందించేందుకు ముందుకు వచ్చింది.

దీంతో జిల్లా కలెక్టర్ దేశాయిపేట గ్రామా నికి చేరుకుని కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్‌తో మా ట్లాడి అందరికీ ఖాతాలతో పాటు డెబిట్ కార్డులు అందిం చాలని సూచించారు. ఈ నెలాకరులోగా సాధ్యమైనంతవరకు డెబిట్ కార్డుల అందజే త ముగించాలన్నారు. కొత్త సంవత్సరలో గ్రామంలో ప్రతి ఒక్కరూ నగదు ర హిత లావాదేవీలు జరపాలన్నారు. అయితే నగదు రహితం కోసం గ్రామ ంలో 5 పాయింట్లను గుర్తించారు. ౩ కిరాణా దుకాణాలు, పాల కేంద్రం, రేషన్ షాపులను నగదు రహిత కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు గుర్తించారు. త్వ రలోనే వీరికి స్వైప్ మెషీన్‌లను అందించేందుకు అధికారులు కృషిచేయాలని, అలాగే వ్యాపారులకు స్వైప్ మెషీన్‌ల వాడకం పై అవగాహన కల్పించారు. మండలంలోనే వందశాతం నగదు రహిత గ్రామంగా దేశాయిపేటను నిలపా లని ప్రజలతో పాటు అధికారులకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్షం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపిడిఒ సురే ందర్‌రెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, గ్రామసర్పంచ్ తోక మమత, ఎంపిటిసి భాగ్య లక్ష్మి, ఆర్‌ఐ కార్తీక్, వీఆర్‌ఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.