Home తాజా వార్తలు బ్యాంకులు తెరిచే ఉంటాయ్

బ్యాంకులు తెరిచే ఉంటాయ్

Nirmala Sitharaman

 

ఎటిఎంలు కూడా పనిచేస్తాయ్
ప్రజలు ఆందోళన చెందొద్దు
లాక్‌డౌన్ వేళ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత

న్యూఢిల్లీ: బ్యాంకుల బ్రాంచ్‌లు తెరిచే ఉంటాయని, ఎటిఎంలను కూడా నగదుతో నింపుతారని, సేవలు అందుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తం గా లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు బ్యాంకింగ్ సేవ లు అందుతాయా? లేదా? అనే ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీతారామన్ దీనిపై సమాచారమిస్తూ ఓ ట్వీట్ చేశారు. అన్ని బ్యాంకుల శాఖలు తెరిచి ఉండేలా కృషి చేస్తున్నాయని, ఎటిఎంలు పనిచేస్తాయని అన్నారు. దీంతోపాటు బ్యాంకు సిబ్బంది కృషిని కూడా ఆమె ప్రశంసించారు. అంతేకాకుండా బ్యాంకుల్లో సామాజిక దూరా న్ని పాటించాలని, శానిటైజర్‌లను అందిస్తున్నామని ఆర్థి క మంత్రి చెప్పారు.

బ్యాంకులను అత్యవసర సేవల్లో భాగంగా చేర్చారు. అందువల్ల లాక్‌డౌన్ సమయంలోనూ బ్రాంచ్‌లను తెరిచే ఉంచుతున్నాయి. చాలావరకు బ్యాంక్ లు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. ఎస్‌బిఐ సహా పలు బ్యాంక్‌లు అత్యవసర సేవలు మినహా ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాయి. అంతకు ముందు శనివారం ఆర్థిక మంత్రి బ్యాంకుల అధిపతుల తో సమగ్ర చర్చలు జరిపారు. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్యాంకింగ్ సేవలను కొనసాగిస్తామని, బ్యాంకుల అన్ని శాఖలు తెరిచే ఉంచుతాయని బ్యాంకుల అధిపతులు హామీ ఇచ్చారు.

ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బుల విత్‌డ్రాలు
అత్యవసర పరిస్థితులను ఊహించి ప్రజలు బ్యాంకుల నుండి భారీ మొత్తంలో డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. మార్చి 13నాటికి డిపాజిటర్లు రూ.53,000 కోట్ల నగదును బ్యాంకుల నుండి విత్‌డ్రా చేసుకున్నారు. పెద్ద మొత్తంలో విత్‌డ్రాలు పండుగలు లేదా ఎన్నికల సమయంలో మాత్రమే జరుగుతాయి. అ.ఇతే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ డిపాజిటర్ల ఆందోళనలను ప్రస్తావిస్తూ, దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితం, పటిష్టంగా ఉందని అన్నారు. స్టాక్ మార్కెట్ పతనం కారణంగా బ్యాంకుల షేర్లు క్షీణించడం ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.

All Banks Ensuring Branches Open, ATMs Working