Friday, March 29, 2024

రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్

- Advertisement -
- Advertisement -

All Banks will be closed on march 28 29

 

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సోమ , మంగళవారాలలో సిబ్బంది సమ్మెతో బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు పిలుపు నిచ్చింది. ఆర్థిక సంవత్సరం ఆరంభపు దశలో రెండు రోజుల బ్యాంకు సమ్మె ప్రజలకు పలు వెతలను మిగిల్చేలా ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ అంతా ఈ రెండు రోజుల సమ్మెలో పాల్గొంటుందని ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది.

మార్చి 22 వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త ఫోరం సమావేశం జరిగింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ డిమాండ్ల సాధనకు రెండు రోజుల సమ్మెకు దిగాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కార్మికులు, రైతులు, ప్రజలు, జాతీయ విధానాలకు భంగకరరీతిలో వ్యవహరిస్తోందని జాయింట్ ఫోరం విమర్శించింది. పలు మార్లు హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారలేదని, సమ్మెకు దిగక తప్పడం లేదని ప్రకటనలో వివరించారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకింగ్ చట్టాల సవరణల బిల్లు వంటి అంశాలకు నిరసనగా తాము సమ్మెకు పిలుపు నిచ్చినట్లు తెలిపారు.

కస్టమర్లూ రెండురోజులు ఇబ్బందే :ఎస్‌బిఐ

ఈ నెల 28, 29వ తేదీలలో సమ్మెతో బ్యాంకింగ్ వ్యవస్థ నిలిచిపోతుందని, ఖాతాదార్లు ఈ విషయాన్ని గమనించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఓ ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల సమ్మె జాతీయ సమ్మెగా రూపాంతరం చెందింది. ఇందులో ఇతర వివిధ రంగాల వర్కర్లు కూడా పాల్గొననున్నారు. బొగ్గు గనులు, స్టీల్, ఆయిల్ టెలికం, ఇన్‌కంటాక్స్, కాపర్, బీమా వంటి రంగాలకు చెందిన ఉద్యోగులు వివిధ స్థాయిల కార్మికులు కూడా పాల్గొంటున్నారు. ఇక రైల్వే, రక్షణ రంగాల యూనియన్లు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. సంఘీభావ సూచకంగా వందలాది చోట్ల జనసమీకరణకు దిగనున్నాయి. రెండు రోజుల సమ్మె విజయవంతానికి అన్ని సంఘాలు కలిసికట్టుగా సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News