Home జాతీయ వార్తలు కశ్మీర్‌ను ఎవరూ రక్షించలేరు

కశ్మీర్‌ను ఎవరూ రక్షించలేరు

Farooq-Abdullahaజమ్మూ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత బలగాలు ఉగ్రవాదులను ఎదుర్కోలేవని అన్నారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఒకవేళ యావత్ భారత సైన్యం వచ్చినా ఉగ్రవాదులు, మిలిటెంట్ల నుంచి కశ్మీర్‌ను రక్షించలేరని చెప్పారు. పిఒకె పాకిస్థాన్‌లో ఉందని, అది ఆదేశంతోనే ఉంటుందని, జమ్మూ కశ్మీర్ భారత్‌లో భాగంగానే కొన సాగుతుందని శుక్రవారం ఆయన వ్యాఖ్యానించి విమర్శలకు తెర లేపారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆయన శనివారం దానిపై వివరణ ఇచ్చారు. తాను చెప్పినదాంట్లో కొత్త విషయం ఏమీలేదని ఫరూఖ్ అబ్దుల్లా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.