Home జాతీయ వార్తలు రాష్ట్ర విభజనలో అన్ని పార్టీల ప్రమేయం

రాష్ట్ర విభజనలో అన్ని పార్టీల ప్రమేయం

J.D

కర్నూలు : రాష్ట్ర విభజనలో అన్ని పార్టీల ప్రమేయం ఉందని మాజీ కేంద్రమంత్రి , కాంగ్రెస్ నేత జెడి శీలం అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరికీ అన్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు. నంద్యాలలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను సరిగా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆయన గురువారం నంద్యాలలో ప్రచారం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు కిల్లి కృపారాణి, తులసిరెడ్డి, కోట్ల సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.

All parties involved in the division of the state