Home జోగులాంబ గద్వాల్ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం

Niranjan-reddy-image

అన్ని రిజర్వాయర్ నింపుకోవాలి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడి

మనతెలంగాణ/గద్వాల: నెట్టెంపాడు ప్రాజెక్ట్ ద్వారా అన్ని రిజర్వాయర్లు నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ధరూర్ మండలం నెట్టెంపాడు ప్రాజెక్ట్ పరిధిలో గల ఫేజ్ 1 లిఫ్ట్‌ను ఆయన పరిశీంచారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్ క్రింద గల గుడ్డెందోడ్డి, ర్యాలంపాడు, తటీకుంట, నాగర్‌దోడ్డి,ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి రిజర్వాయర్లను త్వరగా నింపడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ ఖరిఫ్‌లో జూరాల డ్యాం కు వచ్చే వరద నీటిని ముందుగా అన్ని నింపుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పంప్ హౌస్ లిఫ్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు చూపుతో రైతులకు ఉచిత కరెంట్, సాగునీరు ఇవ్వాడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల పెట్టుబడికి కావలసిన రూ. 4 వేలు ఇవ్వడం వలన రైతులు అప్పులు చేయకుండా వ్యవసాయం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికి నాలుగు ప్రాజెక్ట్ పనులు చురుకుగా జరుగుతున్నాయన్నారు. వాటి ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామన్నారు. గతంలో వ్యవసాయం సంక్షోభం వస్తే అనేక మంది శాస్త్రవేత్తలు అంచనాలు వేసే వారు. ప్రస్తుతం మనకు సంక్షోభం వచ్చినా రిజర్వాయర్ పుష్కలంగా నీరు ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. 2001లో తెలంగాణ ఉద్యమం వలన అన్ని ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టారని, వాటిని పూర్తి చేయకుండానే మధ్యలోనే వదలివేశారని, పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారీ భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపిపి సుభాన్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.