Home జాతీయ వార్తలు ఢిల్లీ సరిహద్దులను వారం రోజులు మూసివేస్తాం: కేజ్రీవాల్

ఢిల్లీ సరిహద్దులను వారం రోజులు మూసివేస్తాం: కేజ్రీవాల్

All shops including barber shops will reopen in Delhi

 

న్యూఢిల్లీ: సరిబేసి విధానంలో బార్బర్ షాపులు, సెలూన్లతో సహా అన్ని షాపులను తెరిచేందుకు అనుమతి ఇస్తామని సిఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. లాక్ డౌన్ సడలింపులతో ఈ రోజుతో అన్ లాక్ 1లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఢిల్లీ సరిహద్దు తెరవడంపై సిఎం క్లారిటీ ఇచ్చారు.  రాష్ట్ర సరిహద్దులను మరో వారం రోజుల పాటు మూసివేస్తామని, పాస్ లు ఉన్న వారికి మాత్రమే లోపలికి ప్రవేశించే అవకాశం కల్పిస్తామన్నారు. లాక్ డౌన్ సడలింపుపై, రాష్ట్ర సరిహద్దులపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు సోమవారం తీసుకున్నారు. వారం రోజుల తరువాత మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర ప్రకటన మేరకు రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ మాత్రం ఢిల్లీలో అమల్లో ఉంటుందన్నారు.

All shops including barber shops will reopen in Delhi