Home తాజా వార్తలు పల్లెలను అందంగా తీర్చిదిద్దాలి

పల్లెలను అందంగా తీర్చిదిద్దాలి

villages

 

రోడ్లపై చెత్త వేస్తే రూ.500 జరిమానా
ఎల్లంపల్లి పరిశుభ్రతలో జిల్లాలో నెంబర్‌వన్‌గా ఉండాలి
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్ : జిల్లాలోని పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని రాష్ట్ర పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెలు ప్రగతి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధిపథంలో పయణిస్తుందన్నారు. గ్రామ రూపు రేఖలు మారిపోయేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం లో తీసుకొని ప్రజ సమస్యలను పరిష్కరించాలన్నా రు. ప్రజలు శ్రమదానం తో పనులు చేసులా ప్రోత్సహించాలన్నారు. శిథిలవస్థలో ఉన్న ఇండ్లను తొలగించి పాడు బడిన బావులను పూడ్చివేయాలన్నారు.

పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్లను, లోతట్టు ప్రాంతాల్లోని గుంతలను పూడ్చివేయాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కచ్చితంగా నిర్మించుకోవాలన్నారు. ఎవరైనా రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. గ్రామాల్లో కొత్త స్తంభాలు సరి చేయాలని, ప్రమాదకరంగా ఉన్న సంభకాలను తొలగించి కొత్త సంభాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎల్‌ఈడి లైట్లను అమర్చాలని, తాజా వైర్లను సరి చేయాలన్నారు. అందరూ కలిసి చేయి చేయి కలిపి పని చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వం సఫాయి కార్మకుల వేతనం రూ.8500 పెంచిందన్నారు.

గ్రామంలో రూ.30 లక్షలతో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి మంజూరైందన్నారు. ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్‌లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పంచాయతీ కో ఆప్షన్ సభ్యులుగా బోయినపెల్లి కిషన్‌రావు, అల్లో మురళీధర్‌రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పారిశుద్ధం, పచ్చదనం, వీధి దీపాలు పనులు ఒక్కొక్క కమిటీలో 20 మంది సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు సుభాష్‌రావు, పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపిపి కోరిపెల్లి రామేశ్వరరెడ్డి, ఎంపిడిఓ సాయినాథ్, సర్పంచ్ అల్లోల రవీందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు అల్లోల గోవర్ధన్‌రెడ్డి, ప్రత్యేకాధికారి గురునాయక్, అల్లోల మురళిధర్‌రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

All the villages should be green and clean