Home తాజా వార్తలు గందరగోళంలో ఇన్వెస్టర్

గందరగోళంలో ఇన్వెస్టర్

bsn

మెరుగైన కార్పొరేట్ ఫలితాలతో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి నిఫ్టీ 

అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది: నిపుణులు

గతవారం స్టాక్‌మార్కెట్లు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్లూచిప్ కంపెనీలు భారీ లాభాల తో ముందుకు సాగగా, మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ లా భపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు బాటమ్ అ వుట్ అయ్యాయా? అంటే కొద్ది రోజులు వేచిచూస్తేగానీ తెలియని పరిస్థితి, ప్రస్తుతం మార్కెట్లు బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 37,000, నిఫ్టీ 11,200 క్రాస్ చేయడం తో దలాల్ స్ట్రీట్‌లో బుల్ చార్జ్ తీసుకుంది. ఐటిసి వంటి పలు కంపెనీలు పటిష్టమైన ఫలితాలను ప్రకటించడంతో సూచీలు రికార్డులను నెలకొల్పాయి. అమెరికా ఫెడరల్ రి జర్వు రేటు, బిఒఇ వడ్డీ రేటు నిర్ణయాలతో పాటు వచ్చే వారం ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం వెలువడనుంది. వాణిజ్య యుద్ధంలో ట్రంప్ తీరు, క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు వంటి అం శాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా మార్కెట్లు ఆల్‌టైమ్ హైలో ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు కొత్త పె ట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు. ఎందుకంటే మార్కెట్ స్టాక్స్‌కు సంబంధించినది, ఆర్థిక స్థాయికి చెందినది కాదు. స్థూల కారకాలు దేశానికి నిజమైన ఆందోళన, అంతిమంగా రిటైల్ పెట్టుబడిదారులకే జరిగే నష్టమైనా లాభమైనా. మార్కెట్ అనిశ్చితి, అసహజ ప్రవర్తన తరువాత ఏం జరుగుతుందోనని ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు.
గతవారం మార్కెట్
* బెంచ్‌మార్క్ సూచీలు గతవారం ప్రారంభం నుంచే బుల్లిష్‌తో ప్రారంభించాయి. సెన్సెక్స్ 222 పాయిం ట్లు పెరిగింది, అదే సమయంలో నిఫ్టీ 11,100 కు చేరింది.
* ఎఫ్‌ఎంసిజి, పిఎస్‌యు బ్యాంక్, రియల్టీ, మెటల్, బ్యాంక్ నేతృత్వంలోని అన్ని రంగాల సూచీలు గ్రీన్ లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మెరుగ్గా కనిపించింది. 200 పాయింట్లు పెరిగింది.
* మంగళవారం మార్కెట్లు రికార్డు స్థాయిలోనే ముగిశాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి, నిఫ్టీ 11,150 వద్ద ముగిసింది.
* బుధవారం నాడు ఈక్విటీ సూచీలు తిరోగమనంలో కనిపించాయి. సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 2 పాయింట్లు తగ్గింది.
* గురువారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 11,150 పాయిం ట్ల వద్ద ముగిసింది.
* రియల్టీ, ఫార్మా, ఫైనాన్షియల్స్ భారీ లాభాల మేర కు నిఫ్టీ పిఎస్‌యు బ్యాంకులు 5 శాతం జంప్ చేశా యి. ఐటి, ఆటో, మెటల్ తగ్గుముఖం పట్టాయి.
* శుక్రవారం నాడు ఐటిసి, హిండాల్కోల నేతృత్వంలో మార్కెట్ రికార్డును నెలకొల్పింది.

ఇండెక్స్, గ్లోబల్ మార్కెట్
– ఈ వారంలో మార్కెట్‌ను చూస్తే పటిష్ఠ ఫలితాల నేపథ్యంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లు 4 నుంచి 5 శాతం పెరిగాయి. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, రియాల్టీ, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, బ్యాంకులు 4- నుంచి 9 శాతం పెరగ్గా, ఐటి, ఆటో, ఎనర్జీ రంగాలు ఫ్లాట్‌గా లాభాలను చూపాయి. మార్కెట్లు అత్యధికంగా లాభపడినప్పటికీ కొన్ని మార్కెట్లు ఇప్పటికీ ఒత్తిడిలోనే ఉన్నాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో అమెరికా విపణి మంచి లాభాలతో ట్రేడ్ అయ్యింది. వాణిజ్య పరిస్థితులు, ముడి చమురు ధరలు కారణంగా ఆసియా మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వచ్చే వారం, ఉత్పత్తి పిఎంఐ, సేవలు పిఎంఐ, మరియు ఉపాధి డేటా అలాగే ఫెడ్ రేట్ నిర్ణయం వంటివి గమనించాల్సిన అంశాలుగా నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్‌ను నడిపించే కీలక అంశాలు
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా ఈ సంవత్సరం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుంది. అయితే పెరుగుతున్న చమురు ధరలు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆర్థికవేత్తల రాయిటర్స్ పోల్ పేర్కొంది. ప్రపంచ ఆర్థికంగా ఆరవ అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా భారత్ ఫ్రాన్స్‌ను అధిగమించింది. 2019 మార్చి ముగింపునాటి ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధిని సాధించగలవని అంచనా వేశారు. మొండి బకాయిల వేగవంత పరిష్కారానికి ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)తో సహా బ్యాంకులు, ప్రధాన ఆర్థిక సంస్థలు ఒక అవగాహన ఒప్పందానికి వచ్చాయి. 22 ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో కలిపి), 19 ప్రైవేటురంగ బ్యాంక్‌లు, 32 విదేశీ బ్యాంక్‌లు ఐసిఎ(ఓవరార్చింగ్ ఇంటర్‌క్రెడిటార్ అగ్రిమెంట్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. వీటితో పాటు ఎల్‌ఐసి, హడ్కో, పిఎఫ్‌సి, ఆర్‌ఇసి వంటి 12 ఆర్థిక సంస్థలు కూడా ఒప్పందంలో ఉన్నాయి. కాన్సార్టియం లెండింగ్ కింద కనీసం రూ.50 కోట్ల విలువచేసే మొండి బకాయిలు కేసులను ఇది కవర్ చేస్తుంది. ఐసిఎలో చేరిన పిఎఫ్‌సి, ఆర్‌ఇసి వంటి ప్రధాన ఎన్‌బిఎఫ్‌సిలు, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ.. దశాబ్దాలుగా పరిష్కారం లేకుండా ఉన్న మొండి బకాయిల కేసులను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాయని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.