Friday, March 29, 2024

ఫైజర్‌తో పదేపదే అలర్జీ

- Advertisement -
- Advertisement -

Allergies in people who have taken Pfizer vaccine

 

టీకాకు వచ్చిపడ్డ చిక్కు

వాషింగ్టన్ : కొవిడ్ వ్యాక్సిన్‌లలో ఆశాకిరణంగా మారిన ఫైజర్ టీకాకు ఇప్పుడు అలర్జీ బెడద పట్టుకుంది. ఫైజర్ వ్యాక్సిన్‌ను నమూనాగా తీసుకున్న పలువురిలో తరచూ దుద్దర్లు ఇతరత్రా అలర్జీలు వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా టీకా మందు తీసుకుంటే అలర్జీలు రావడం సహజమే. అయితే ఫైజర్‌కు సంబంధించి ఊహించినదానికన్నా అధిక స్థాయిలో అలర్జీ లక్షణాలు తలెత్తుతున్నాయి. అది తరచూ ఇవి సంభవిస్తున్నాయి. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రిటన్‌లో ఇప్పటికే ఫైజర్ సంబంధిత జాగ్రత్తలు వెలువరించారు. గణనీయ రీతిలో అలర్జీ తలెత్తిన వారు ఈ టీకాను వాడకుండా ఉండటం మంచిదని అక్కడ ఔషధ నియంత్రణ సంస్థ మార్గదర్శకాలు వెలువరించింది. అమెరికాలోని బయో ఎన్‌టెక్ కంపెనీ ప్రతిష్టాత్మకంగానే ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.

దీనికి అమెరికా అధికార యంత్రాంగం ఇప్పటికే వినియోగ అనుమతిని ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పుడు ఈ ఫైజర్ టీకా రాక కోసం ఎదురుచూస్తున్నాయి. బుధవారమే అమెరికాలో అదనంగా కోటి డోస్‌ల ఈ వ్యాక్సిన్ కోసం కంపెనీతో అంగీకారం కుదిరింది. అయితే అలర్జీలు తలెత్తడంతో ఇప్పుడు కంపెనీ ప్రతినిధులకు, జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐహెచ్)కు మధ్య చర్చలు జరుగుతున్నాయి. మామూలు స్థాయిలో కాకుండా అనూహ్యంగా తరచూ అలర్జీలు తలెత్తడం ఆందోళనకరంగా మారింది. ఫైజర్ టీకా క్రెడిట్ అంతా తనదే అని ఇటీవలి వరకూ ప్రెసిడెంట్ ట్రంప్ చెపుతూ వచ్చారు. అయితే ప్రస్తుత అవలక్షణాల దశతో మాజీ కానున్న ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ఇతర వ్యాక్సిన్‌లతో పోలిస్తే ఇప్పుడు తలెత్తిన అవలక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాక్సిన్ పంపిణీ వేగవంతపు విభాగంలో ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ మోన్సెఫ్ స్లావోయి అంగీకరించారు. వ్యాక్సిన్ తీసుకుంటే ఇతరత్రా ఇబ్బందులు వస్తాయనే ఆందోళన తలెత్తడంతో ఇప్పుడు వివిధ దేశాలలో ఈ ఫైజర్ పంపిణీ కార్యక్రమాలపై ప్రభావం పడనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News