Friday, April 19, 2024

టెన్త్ పరీక్షలకు 4 రోజుల ముందే కేంద్రాల కేటాయింపు

- Advertisement -
- Advertisement -
Allocation of centers 4 days prior to Tenth exams

 

పరీక్షా కేంద్రాల నోటీసు బోర్డులో రోల్ నెంబర్ల వారీగా వివరాలు
నూతన కేంద్రాలపై విస్తృతంగా ప్రచారం
వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ స్పెషల్ సిఎస్

మనతెలంగాణ/హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నాలుగు రోజుల ముందుగానే విద్యార్థులకు కేటాయించిన రోల్ నెంబర్ల వివరాలు నోటీసు బోర్డులో పొందుపరచనున్నట్లు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. నూతన పరీక్షా కేంద్రాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయపు వెబ్‌సైట్‌లో కూడా నూతన పరీక్షా కేంద్రాలు, రోల్ నెంబర్ల వారీగా కేటాయింపుల వివరాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నాలుగు రోజుల ముందుగానే పరీక్షా కేంద్రాలను చూసుకోవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ డిఇఒలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ సిఎస్ మాట్లాడుతూ, టెన్త్ విద్యార్థులకు రవాణా ఏర్పాట్లు, కోవిడ్ 19 నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు ఇచ్చారు.

టెన్త్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారంతో సమావేశాలు నిర్వహించి, వారి సహకారంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని తెలిపారు. ప్రతి రోజూ పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయడంతో పాటు విద్యార్థులకు మాస్కులు అందజేయాలని చెప్పారు. హైకోర్టు సూచనల మేరకు విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా వృత్తాకారంలో సర్కిల్ గీసి ఆ క్రమంలో థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాలలో విద్యార్థులను అనుమతించాలని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన సలహాలు, సంప్రదింపులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనారోగ్యంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక గదులలో ఉంచి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలు రాయించాలని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News