Home తాజా వార్తలు రివెంజ్ ఫార్ములతోనే

రివెంజ్ ఫార్ములతోనే

Allu Arjun

 

 

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాను అల్లు అర్జున్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని సమాచారం. గతంలో కూడా సుకుమార్… ‘1…నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. ఇప్పుడు కూడా బన్నీతో చేయబోయే సినిమా కూడా రివెంజ్ స్టోరీతోనే చేస్తున్నారు. కాగా ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా రఫ్‌గా ఉంటుందని.. అలాగే అతని లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందట. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్ ఈ సినిమాతో కూడా పెద్ద హిట్ కొడతారేమో చూడాలి.

Allu Arjun movie with Sukumar