Friday, March 29, 2024

మెగా ఫ్యామిలీకి దూరంగా ఐకాన్ స్టార్… వార్ నిజమేనా?

- Advertisement -
- Advertisement -

‘పుష్ప’ బ్లాక్ బస్టర్ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియన్స్ కు దగ్గరైన బన్నీ.. పుష్ప సినిమాతో మరింత చేరువయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా మెగా ఫ్యామిలీ హీరోగానే అభిమానులందరు చూశారు. మెగా అభిమానులు కూడా బన్నీకి అభిమానించి అండగా ఉన్నారు. సినిమా కోసం బన్నీ ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించిన విషయం తెలిసిందే. అలా ఒక్కో విజయంతో స్టార్ హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ కొంతకాలంగా మెగా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట ఓ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటూ మెగా అభిమానులు గోల చేసినా.. ‘చెప్పను బ్రదర్’ అని బన్నీ ముగించాడు.దీంతో హర్ట్ అయినా మెగా ఫ్యాన్స్ అప్పటి నుంచి బన్నీపై అగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరోవైపు బన్నీ కూడా మెగా ఫ్యాన్స్ ను పట్టించుకోకుండా తన ఫ్యాన్ బేస్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని.. అందులో భాగంగానే తనను ఇష్టపడే అభిమానులను తన ఆర్మీగా చెప్పుకుంటున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీకి, మెగాఫ్యామిలీకి మధ్య దూరం కూడా పెరిగిందని.. వారిలో కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా బన్నీ చేసి పనికి.. ఆ వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. అదేంటంటే.. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అస్కార్ సాధించడంతో పలువురు సినీ ప్రముఖులు చిత్రయూనిట్ ను కొనియాడుతూ ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో బన్నీ కూడా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ పైనే బన్నీ ప్రశంసలు కురిపించాడు. ‘అవర్ తెలుగు ప్రైడ్ తారక్’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు. దీంతో మెగాఫ్యాన్స్ బన్నీపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే, మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు విషెష్ తెలిపారు. అస్కార్ సాధించిన తర్వాత రామ్ చరణ్ బర్త్ డే రావడంతో మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ గా తన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు.

ఈ పార్టీకి సినీ ప్రములు హాజరై సందడి చేశారు. అయితే, అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. కనీసం చరణ్ కు బర్త్ డే విషెష్ చెప్తూ ట్వీట్ కూడా చేయకపోవడం, బర్త్ డే పార్టీలోనూ కనిపించకపోవడం చూస్తే వీళ్ల మధ్య వార్ నిజమనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మెగాఫ్యాన్స్ కూడా బన్నీపై గుర్రుగా ఉన్నారు. బన్నీ వ్యవహార తీరుపై మెగా ఫ్యామిలీ గాని, అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇస్తే తప్ప ఈ కోల్డ్ వార్ రూమార్స్ ఆగేటట్లు లేవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News