Tuesday, April 16, 2024

‘లవ్’ అంటే ఇది అని… ‘లవ్’ అంటే నువ్వని

- Advertisement -
- Advertisement -

Allu Arjun

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తన పిల్లల విషయంలో బన్నీ చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్లకి అన్నీ స్పెషల్‌గా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. వారి విషయంలో ఎంత ఎమోషనల్‌గా ఉంటారో గతంలో అనేక సందర్భాల్లో మనం చూశాం. ఇక శుక్రవారం అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ పుట్టినరోజు. ఈ రోజుతో ఆరేళ్లు పూర్తి చేసుకున్న అల్లు అయాన్ బర్త్ డే సందర్భంగా బన్నీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “వాట్ ఈజ్ లవ్… అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నా జీవితంలో ఇంతకముందు ఎన్నో బలమైన ఫీలింగ్స్‌ని పొందాను.

కానీ వాటిని నేను లవ్ అని భావించలేదు. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత అర్ధమైంది ‘లవ్’ అంటే ఇది అని… ‘లవ్’ అంటే నువ్వని. ఐ లవ్ యు అయాన్… హ్యాపీ బర్త్ డే మై బేబీ” అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూస్తేనే అర్థం అవుతుంది బన్నీ ఎంత భావోద్వేగానికి గురయ్యారో అని. అంతేకాకుండా ఈ సందర్భంగా అల్లు అయాన్ 6వ బర్త్‌డే కేక్ కటింగ్ చేసే ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పుట్టిన రోజు వేడుకను జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంట్లో జరుపుకున్నారు.

 

Allu Arjun son birthday celebrations
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News