Thursday, April 25, 2024

రాజకీయ నాయకుడిగా అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

Allu Arjun will be seen as political leader

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్‌లో 21వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌ని అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమా నేపథ్యానికి సంబంధించి ఓ న్యూస్ తెలిసింది.

అల్లు అర్జున్ ఈ సినిమాలో పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నాడట. గతంలో బన్నీ నటించిన ’రేసు గుర్రం’ సినిమా పాలిటిక్స్ బేస్డ్ మూవీ అయినప్పటికీ అందులో అతను పొలిటికల్ లీడర్‌గా నటించలేదు. అయితే ఇప్పుడు కొరటాల సినిమాలో మొదటి సారిగా రాజకీయ నాయకుడిగా బన్నీ నటిస్తాడట. ఈ సినిమా మొత్తం స్టూడెంట్ పాలిటిక్స్, – పేదరికం, – నిరక్షరాస్యత.. ఇలాంటి అంశాలు చుట్టూనే తిరుగుతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కొరటాల శివ మార్క్ మేసేజ్ కూడా ఉంటుందని సమాచారం. ‘ఆచార్య’ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. అదే సమయంలో బన్నీ ‘పుష్ప’ సినిమా పూర్తి చేయనున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News