Wednesday, April 24, 2024

వాళ్లలో అల్లు రామలింగయ్య అగ్రఘన్యుడు

- Advertisement -
- Advertisement -

Allu Ramalingaiah 100th birth Anniversary Celebrations

ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడైన పద్మశ్రీ అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అల్లు ఫ్యామిలీ హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన శతజయంతి వేడుకలకి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, సాయి ధరమ్ తేజ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు. అల్లు రామలింగయ్యపై రాసిన పుస్తకాన్ని వెంకయ్యనాయు డు ఆవిష్కరించి తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘సినిమాలలో ఉన్నత విలువలు, కొన్ని సంప్రదాయాలు నిలబెట్టిన వాళ్లలో అల్లు రామలింగయ్య అగ్రఘన్యుడు. ఏ విధమైన అసభ్యత లేకుండా, కేవలం తన హావభావాలతో నవ్వించగల నటులు ఆయన’ అని కొనియాడారు. చిరంజీవి మాట్లాడుతూ… అల్లు రామలింగయ్యతో నాకు ఉన్న అనుబంధం ఇంకెవరితోను లేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అల్లు రామలింగయ్య గారిని మొదటి సారి చూసిన సమయంలోనే ఆయన తీరును చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ సమయంలో చాలా మంది ఉండగా ఆయన నా వైపే పదే పదే చూస్తూ నన్ను గమనించడం చేసేవారు. ఆ సమయంలో నాకు ఆయన ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత అర్థమైంది. అల్లు రామలింగయ్య ఒకసారి షూటింగ్ పూర్తి చేసుకొని రైల్లో వెళుతున్న నన్ను పక్కన కూర్చోబెట్టుకొని మందు తాగుతావా అంటూ అడిగారు. అప్పటికి నాకు అలవాటు లేదండి అని, హనుమాన్ భక్తున్ని అంటూ అక్కడి నుంచి వెళ్లాను. అలా నా గురించి పలుసార్లు ఆయనకు పాజిటివ్ గా అనిపించింది. ఒకరోజు ఆయన మా నాన్నగారిని కలిసి నా పెళ్లి గురించి ప్రస్తావించి నాన్నగారిని ఒప్పించారు. ఇష్టం లేకుండానే అల్లు రామలింగయ్య గారింటికి పెళ్లి చూపులకు వెళ్ళాము. అక్కడ సురేఖని చూసిన తర్వాత నో చెప్పలేకపోయాను. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను, ముందు ముందు మరింత భవిష్యత్తు ఉంటుంది. పెళ్లికి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని సంశయిస్తూ ఉండగా సురేఖని చూసి నో చెప్పలేక ఓకే చెప్పాను. ఆ తర్వాత మా పెళ్లయింది. అల్లు రామలింగయ్య నిరంతర విద్యార్థి, చిరస్మరణీయుడు ఆయన మరణించలేదు మన మద్యే ఉన్నరని కొనియాడారు.

Allu Ramalingaiah 100th birth Anniversary Celebrations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News