Home తాజా వార్తలు ఫ్యామిలీతో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్

ఫ్యామిలీతో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్

Allu Sirish Birthday Celebrations

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడైన హీరో అల్లు శిరీష్ శనివారం తన 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ శిరీష్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి స్వయంగా కేక్ తయారు చేసిందట. ఇక తన కుటుంబం సమక్షంలో శిరీష్ కేక్ కట్ చేశాడు. ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అరవింద్, అల్లు అర్జున్,- స్నేహ రెడ్డి, వెంకటేష్.. ఇంకా పిల్లలు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. “స్కూల్ డేస్‌లో అయితే నా బర్త్ డే ఎప్పడూ సమ్మర్ వెకేషన్‌లో వస్తుండేది. దాంతో ఫ్రెండ్స్ ఎవరూ అందుబాటులో ఉండేవారు కాదు. అందుకే ఎక్కువగా బర్త్ డే జరుపుకోలేదు. కేవలం మూడు, నాలుగుసార్లు మాత్రమే జరుపుకున్నాను. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులతో కలిసి బర్త్‌డే జరుపుకుంటున్నాను”అని అల్లు శిరీష్ తెలిపాడు.