Tuesday, April 23, 2024

తిరిగి సెట్స్‌పైకి ‘అల్లుడు అదుర్స్’..

- Advertisement -
- Advertisement -

‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాష్‌రాజ్‌లపై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్, అనూ ఇమాన్యుయల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక, ఈ ‘అల్లుడు అదుర్స్’ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నారు. అలాగే 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఫిల్మ్‌మేకర్స్.

‘Alludu Adhurs’ movie Shooting Resume

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News