Wednesday, November 30, 2022

అల్లూర్ ఇన్‌ఫ్రా ప్రాపర్టీ ఫండ్ మేనేజర్‌గా అసెట్స్ అండ్ మోర్

- Advertisement -

Allure infra appoints assets & more as property fund manager

 

మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ ప్రాప్ టెక్ కంపెనీ ‘అసెట్స్ అండ్ మోర్’ బుధవారం అల్లూర్ ఇన్‌ఫ్రాతో మెగా ప్రాపర్టీ సర్వీసెస్ డీల్‌ను కుదుర్చుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనే వినూత్న కాన్సెప్ట్‌ను తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిన సంస్థ అసెట్స్ అండ్ మోర్, తాజాగా అల్లూర్ ఇన్‌ఫ్రా ప్రాపర్టీ ఫండ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. బెంగళూరులో ఉన్న అల్లూర్ ఇన్‌ఫ్రాకు చెందిన 3 ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, పూర్తి నిర్వహణ సేవలను అందించనుంది. ఇంకా బెంగళూరు ఐటీ హబ్‌గా ఉన్న మార్తహళ్లి సమీపంలో సిద్ధం చేసే వాణిజ్య సముదాయాలకు అవసరమైన ప్రాపర్టీ ఫండింగ్‌తో పాటు అమ్మకాలు, నిర్వాహణ బాధ్యతలు చూసుకోనుంది.

ఇప్పటికే వాసవీ గ్రూప్, శాంతా శ్రీరామ్‌తో అసెట్స్ అండ్ మోర్ మెగా డీల్‌ను కుదర్చుకుంది. ఈ సందర్భంగా అసెట్స్ అండ్ మోర్ ఫౌండర్ హను యెడ్లూరి మాట్లాడుతూ… అల్లూర్ ఇన్ఫ్రాతో ఒప్పందం కంపెనీ వ్యాపార చరిత్రలో మరో మైలురాయి అని అన్నారు. అల్లూర్ వెంచర్స్ సిఇఒ దిలీప్ సి బైరా మాట్లాడుతూ, కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి ఎక్కువ, ఇన్వెస్టర్లు తక్కువ, ఇది పెను సవాల్ అని అన్నారు. హెచ్‌ఎన్‌ఐలకు పరిమితమైన ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌ను ఇకపై రిటైల్ ఇన్వెస్టర్లకు అసెట్స్ అండ్ మోర్ వంటి ప్రాప్ టెక్ వంటి సంస్థల ద్వారా లబ్ధిని చేకూరనుందని అన్నారు.

Allure infra appoints assets & more as property fund manager

Related Articles

- Advertisement -

Latest Articles