Friday, April 19, 2024

ఒక్క తప్పు.. 8లక్షల కోట్లు ఆవిరి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఒక్క రోజులో 100 బిలియన్ డాలర్ల (రూ.8,24,545 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. గూగుల్ కొత్త చాట్‌బాట్ ‘బార్డ్’ ప్రచార వీడియోలో తప్పుడు సమాచారాన్ని చూపిన తర్వాత కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ప్రత్యర్థి కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్‌జిపిటితో బార్డ్ ఎలా పోటీ పడుతుందో వివరించడంలో గూగుల్ విఫలమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళన కారణంగా ఆల్ఫాబెట్ షేర్లు 9 శాతం పడిపోయాయి. ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్లు తగ్గింది. కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పుడు 1. 278 ట్రిలియన్ డాలర్లు మిగిలి ఉన్నాయి. ఇటీవల అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్టు కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ పది రోజుల్లో 100 బిలియన్ డాలర్లు తగ్గింది. కానీ ఆల్ఫాబెట్ తన చాట్‌బాట్‌లో పొరపాటు కారణంగా ఒక్క రోజులో 100 బిలియన్ డాలర్లను కోల్పోయింది. మైక్రోసాఫ్ట్ చాట్‌జిపిటికి పోటీగా ఆల్ఫాబెట్ ఇటీవల చాట్‌బాట్ బార్డ్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన చిన్న జిఫ్ వీడియోను కంపెనీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది, కానీ తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో దీని లాంచ్ ఈవెంట్‌ను పారిస్‌లో నిర్వహించనున్నారు. తొమ్మిదేళ్ల చిన్నారికి నేను చెప్పగలిగిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏమి కనుగొంది? అని గూగుల్ చాట్‌బాట్‌ను అడగ్గా.. బార్డ్ రకరకాల సమాధానాలు ఇచ్చాడు. దీని ద్వారా మొదటిసారి భూమి సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం చిత్రం తీసినట్టు దీనిలో సమాధానం కూడా ఉంది. అయితే తప్పుడు సమాచారం వచ్చింది.

ఈ పనిని మొదటిసారిగా 2004లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్ చేసింది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధృవీకరించింది. గూగుల్ కంపెనీ ప్రకటనల ఆదాయాల్లో గణనీయమైన తగ్గుదల ఉంది. చాట్‌బాట్ విషయంలో మైక్రోసాఫ్ట్ కంటే వెనుకబడిపోయిందని భావిస్తున్నారు. దీంతో బుధవారం కంపెనీ షేర్లు క్షీణించాయి. ఆల్ఫాబెట్ ఇప్పటికీ ప్రపంచంలోనే నాలుగో అత్యంత విలువైన కంపెనీగా ఉంది. ఈ జాబితాలో ఆపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో, సౌదీ అరామ్కో మూడో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 195.85 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో 48వ స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News