Friday, April 19, 2024

సీనియర్ స్టార్‌కు జోడీగా…

- Advertisement -
- Advertisement -

Amalapaul act in tollywood film

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ’బెజవాడ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపునే తెచ్చుకుంది ఈ భామ. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో నాయక్, ఇద్దరమ్మాయిలతో చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. మెగా హీరోయిన్ అనిపించుకున్నా కూడా ఎందుకో కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. తెలుగులో చివరగా నాని నటించిన ’జెండాపై కపిరాజు’ సినిమాలో నటించిన అమలాపాల్… మేము, వి.ఐ.పి. 2, ఆమె వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ప్రస్తుతం రెండు తమిళ్, ఒక మలయాళ సినిమా చేస్తున్న అమలాపాల్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో నటిస్త్తోందని సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా తెలుగులో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్‌ను ఈ భామ కొట్టేసిందని తెలిసింది. సీనియర్ హీరో నందమూరి బాలయ్య సరసన అమలాపాల్ నటించనుందట. బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బాలయ్య,- బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే ఫస్ట్ లుక్ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా ఎవరు నటించబోతున్నారంటూ నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ కోసం వేట సాగించిన చిత్ర యూనిట్ చివరకి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న అమలాపాల్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆమెతో దీనికి సంబంధించి చర్చలుకూడా జరిగాయట. ఈ సినిమాలో నటించడానికి ఈ బ్యూటీ ఓకే చెప్పిందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News