Friday, January 27, 2023

అమితాబ్, జయ విడిపోయారటా..!?

- Advertisement -

Amithabh-And-Jayaముంబయి : బాలీవుడ్ సీనియర్, మోస్ట్ పాపులర్ కపుల్ అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ విడివిడిగా ఉంటున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ రాజకీయ నాయకుడు, అమితాబ్ మాజీ స్నేహితుడు అమర్ సింగ్ అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. అమితాబ్, జయ విడిగా ఉంటున్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. జయకి, ఆమె కోడలు ఐశ్యర్యరాయ్ బచ్చన్‌కి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు.
‘దేశంలో ఏది జరిగిన అందుకు కారణం నేనే అంటున్నారు. అంబానీ సోదరులు విడిపోవడానికి కారణం నేనే అని నిందించారు. కానీ దానికి కారణం నేను కాదు. బచ్చన్స్ విషయంలోనూ అదే అంటున్నారు. కానీ నేను అమితాబ్‌ను కలవక ముందు నుంచే అమితాబ్, జయ విడిగా ఒకరు ‘ప్రతీక్ష’లో మరొకరు ‘జనక్ ఉంటున్నారు. ఇక ఐశ్వర్య, జయల మధ్య కూడా విబేధాలు ఉన్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. కానీ వీటికి నేను బాధ్యుడ్ని కాదు’ అని అమర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles