Home తాజా వార్తలు సిసిసికి అమర రాజా బ్యానర్ రూ.10 లక్షల విరాళం

సిసిసికి అమర రాజా బ్యానర్ రూ.10 లక్షల విరాళం

galla padmavathi

 

అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తన కుమారుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తూ ఒక చిత్రాన్ని నిర్మిస్తోన్న పద్మావతి గల్లా బుధవారం కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కి రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మావతి గల్లా మాట్లాడుతూ “లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటైన సిసిసికి తమ వంతుగా రూ.10 లక్షలు అందజేస్తున్నాం. ఇక లాక్ డౌన్ కారణంగా అశోక్ గల్లా చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాం”అని అన్నారు.

Amara Raja Banner donates Rs 10 lakh to CCC