Friday, April 19, 2024

జగన్ హీరో… పవన్ విలన్: అమర్నాథ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లా తమవి అమ్ముడుపోయే కుటుంబాలు కావని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సన్నాసి రాజకీయాలు చేయడం తమకు చేతకాదన్నారు. పవన్‌కు అమర్నాథ్ రీకౌంటర్ ఇచ్చారు. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. కాపుల్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాలని పవన్ చూస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబం గురించి మాట్లాడటానికి పవన్‌కు సిగ్గుందా? అని ప్రశ్నించారు. పవన్‌లా ప్యాకేజీలకు తాళాలు కొట్టే కుటుంబం కాదని విమర్శించారు. మా తాత, మానాన్న, తాను అంతా ఎంఎల్‌ఎలము అని తెలియజేశారు. మా నాన్న మంత్రి, తాను మంత్రినని చెప్పారు. ముమ్మాటికీ పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని అమర్నాథ్ మండిపడ్డారు. ప్యాకేజీకి అమ్ముడుపోలేదని పవన్ ఒట్టేసి చెప్పగలరా? అని అడిగారు. పవన్‌లో ఉన్నవి నారా వారి నరాలు, ప్రవహిస్తోందని పసుపు రక్తం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాంటి వాడి నోటి వెంట తన పేరు రాకపోవడం మంచిదన్నారు. రాజకీయాల్లో సిఎం జగన్ హీరో… విలన్ పవన్ కల్యాణ్ అని దుయ్యబట్టారు. పిఎస్‌పికె అంటే ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News