Home దునియా ఔషధ ఫలం నేరేడు

ఔషధ ఫలం నేరేడు

Jamun-Fruitనేరేడు పండ్లు సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఈ పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. కోలగా ఉండి పెద్దగా ఉండేవి ఒకరకమయితే, గుండ్రంగా చిన్నగా ఉండేవి మరో రకం. ఈ రెండు రకాల పండ్లు మన దేశంలో దొరుకుతాయి. పెద్దగా కోలగా ఉండేవాటిని అల్లనేరేడు అంటాం. గుండ్రంగా చిన్నగా ఉండే వాటిని ‘చిట్టి నేరేడు ’ అని పిలుస్తాం. నేరేడు పండు తీపి, వగరుగా ఉంటుంది. వీటిలో పోషక పదార్థాలు, ఔషధ గుణాలు పుష్కలం. కార్పొహైడ్రేట్స్, ప్రొటీన్స్, స్వల్పంగా ఫ్యాట్, ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అధిక శాతంలో నీరు, సోడియం, పొటాషియం, కాల్షియం, పాస్ఫరస్, మాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్, సల్ఫర్, ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, క్రోమియం లాంటివన్నీ శరీరానికి లభిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో నేరేడు పండును దేవతాఫలంగా భావిస్తారు. శ్రీరాముడు వనవాసంలో ఈ పండ్లనే ఎక్కువగా తిన్నాడని రామాయణం చెబుతోంది. నేరేడు గుజ్జుతో జామ్, జెల్లీ, వైన్, వెనిగర్ లాంటివి తయారు చేస్తారు. ఈ చెట్టు కలపను ఫర్నీచర్ తయారీకి ఉపయోగిస్తారు. ఇది ఔషధ పరంగా ఎంతగానో ఉపయోగిస్తారు.

* ఆహారం తీసుకున్న తర్వాత ఈ పండ్లను తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది.
* నేరేడు రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
* క్యాన్సర్ వ్యాధి నివారణకు తోడ్పడుతుంది.
* డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచడానికి ఔషధంలా పనిచేస్తుంది.
* నేరేడు లేత చిగుళ్లను నీటిలో మెత్తగా రుబ్బి ఆ నీటిని పుక్కిటపట్టి పుక్కిలించి ఉమ్మడంవల్ల పంటి నొప్పి ఉపశమనం కలుగుతుంది.
* రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగేలా చేస్తుంది.
* చర్మ వ్యాధులను పోగొడుతుంది.
* జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది.
* జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు ధనియాల కషాయంలో నేరేడు రసాన్ని కలిపి తాగితే జ్వర తీవ్రత, శరీర ఉష్ణోగ్రత తగ్గుతాయి.
* ఉదరంలోని నులిపురుగులను సంహరిస్తుంది.
* అతిసారాన్ని అరికడుతుంది.
* రక్తవృద్ధి కలుగుతుంది.
* పొరపాటున ఆహార పదార్థాలతో పాటు వెం ట్రుకలోనికి వెళ్లితే నేరేడుపండు తినడం మంచిది.
* ఈ పండు గింజలను ఆయుర్వేద, యునానీ వైద్యంలో వాడుతారు.
* రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
* నేరేడు గింజలను మెత్తని పొడి చేసి, నీటిలో ఆ పొడిని వేసి మరిగించి, ఆ కషాయాన్ని వడకట్టి తాగితే శరీరంలోని చక్కెర నిలువలను తగ్గిస్తుంది.
* ప్రాంక్రియాజి చక్కగా పనిచేసేలా చేస్తుంది.
* రక్తపోటును నియంత్రణ చేసే గుణం ఉంది.
* పైల్స్ వ్యాధి నివారణలో తోడడుతుంది.
* స్త్రీలలో ఏర్పడే నెలసరి సమస్యలను నేరేడు చెక్క కషాయం నివారిస్తుంది. 20 రోజులపాటు ఈ కషాయాన్ని తీసుకోవలసి ఉంటుంది.
* మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటే నేరేడు రసంలో నిమ్మరసాన్ని కలిపి దాన్ని రెండు చెంచాలు కలిపి రోజుకు మూడుసార్లు తాగాలి.
* ఆకులరసంతో పుక్కిలిస్తే నోటిపూత తగ్గుతుంది.
* గింజల పొడికి వ్రణాలను, గాయాలను
మాన్పించే శక్తి ఉంది.
* మూత్ర పిండాల సంబంధిత అనారోగ్యాలు తగ్గిస్తుంది.
* కాలేయపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* నేరేడు పండ్లు తినడం వల్ల పంటి చిగుళ్లు దృఢపడతాయి.
* మెదడు చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పెంచే శక్తి ఈ ఫలానికి ఉంది.
* నేరేడు రసం దంత క్షయాన్ని కలగనివ్వదు.
* నేరేడు పండ్లు చిగుళ్లు, ఆకుల, గింజలు, బెరడుకు ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానముంది.
* నేరేడు గింజల పొడితో కషాయం చేసి వడగట్టి, పాలల్లో కలుపుకుని తాగితే దీర్ఘకాల వ్యాధులు క్రమేపీ తగ్గుతాయి.
* జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
* రెండు, మూడు చెంచాల నేరేడు పండ్ల రసం తాగితే జిగట విరేచనాలు తగ్గుతాయి. తగ్గేవరకూ ప్రతిరోజు నేరేడు రసం తీసుకోవలసి ఉంటుంది.
* గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
* చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
* చలువ చేస్తుంది.
* కంటి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది.
* దగ్గును నివారిస్తుంది.
* వృద్ధాప్య లక్షణాలను త్వరగా దరిచేరనివ్వదు. * రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
* నల్ల ఉప్పు, జీలకర్ర పొడిని ఈ పండ్లతో కలిపి తింటే ఎసిడిటీ, కడుపులో మంట తగ్గుతాయి.
* గింజల్లో ఉండే జింబోలిన్ అనే పదార్థం, పిండి పదార్థాలను చక్కెరగా మారకుండా నిరోధిస్తుంది.
* పరగడుపున నేరేడు లేత ఆకులను నమిలి, ఆ రసాన్ని మింగితే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

Amazing Health Benefits and Uses of Jamun Fruit

                                                                                                                     కౌనిల