Friday, April 19, 2024

‘కిసాన్ స్టోర్’ను ప్రకటించిన అమేజాన్

- Advertisement -
- Advertisement -

Amazon India launches Kisan store

న్యూఢిల్లీ: అమేజాన్ ఇండియా కిసాన్ స్టోర్‌ని ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో మార్పు కలిగించడానికి రైతులకు సాధికారత కలిగించి, టెక్నాలజీని అందించేందుకు ప్రభుత్వం లక్షంలో భాగంగా అమెజాన్ ఈ స్టోర్‌ను రూపొందించింది. కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖమంత్రి నరేంద్ర సింగ్ కిసాన్ స్టోర్ ఆరంభించారు. కిసాన్ స్టోర్ ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్ని తమ ఇంటి వద్ద డెలివరీ పొందవచ్చు-. అమెజాన్ జీ స్టోర్స్‌లో అసిస్టెడ్ షాపింగ్ ద్వారా లభ్యమవుతాయి. వంగడాలు, వ్యవసాయ యాక్ససరీస్, మొక్కల రక్షణ, పోషకాహారం, ఇంకా 8000కి పైగా ఉత్పత్తుల్ని కిసాన్ స్టోర్‌పై అందిస్తున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, అమేజాన్ పే సౌకర్యం ఉంది.

5 కోట్ల కస్టమర్లు

5 కోట్ల కస్టమర్లు ఇప్పుడు అమేజాన్ పే యుపిఐని ఉపయోగిస్తున్నారని అమేజాన్ పే ప్రకటించింది. ఈ మైలురాయి సందర్భంగా షాపింగ్ కోసం బిల్లులు చెల్లించడానికి, ఆన్‌లైన్ వ్యాపారులకు చెల్లించడానికి అమేజాన్‌పే యుపిఐని ఉపయోగించే కస్టమర్లు అందరికీ సెప్టెంబర్ నెల ద్వారా రోజూ బహుమతుల్ని అందిస్తోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News