Home జాతీయ వార్తలు నిరుద్యోగులకు శుభవార్త : అమెజాన్‌లో 22వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త : అమెజాన్‌లో 22వేల ఉద్యోగాలు

Amazon-Fine

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పండుగ సీజన్‌లో నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పండుగ సీజన్‌లో నిర్వహించబోయే సేల్స్‌కు అనుగుణంగా.. భారీగా ఉద్యోగావకాశాలను కల్పించాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 22 వేల సీజనల్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లు, సార్టేషన్ సెంటర్లు, డెలీవరీ స్టేషన్లు, కస్టమర్ సర్వీసు సైట్లలో ఈ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌తో పాటు దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ ఉద్యోగాలు కల్పించనుంది. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడానికి తమ సామర్థం మేరకు ఈ 22 వేలకు పైగా సీజనల్ అసోసియేట్స్ సాయపడతారని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అకిల్ సక్సెనా తెలిపారు.