Home తాజా వార్తలు అమెజాన్‌లో లక్ష నియామకాలు

అమెజాన్‌లో లక్ష నియామకాలు

Amazon to make one lakh new Appointments

న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ 100,000 మంది కొత్త ఉద్యోగుల నియామకాన్ని ప్రకటించింది. తాత్కాలిక, శాశ్వత స్థానాల్లో కొత్త నియామకాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. కొత్త ఉద్యోగులు ఆర్డర్ల ప్యాకింగ్, డెలివరీ లేదా సార్టింగ్ చేస్తారు. సీటెల్ ఆన్‌లైన్ కంపెనీ వ్యాపారం వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్, జూన్ నెలల్లో కంపెనీ రికా ర్డు స్థాయిలో లాభాలు, ఆదాయాలు నమోదు చేసింది. కరోనో వైరస్ మహమ్మారి సమయంలో ప్రజలు కిరాణా, ఇతర వస్తువులను ఆన్‌లైన్‌లో కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1,75,000 మందిని నియమించుకోవాలని కంపెనీ నిర్ణయించింది. గత వారం కంపెనీకి 33,000 కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగాలు ఉన్నాయని, ఈ నియామకాలు చేపట్టాల్సి ఉందని సంస్థ చెప్పింది. తమ 100 కొత్త గిడ్డంగులు, ప్యాకేజీ సార్టింగ్ కేంద్రాలు, ఇతర ప్రదేశాలలో ఇప్పుడు కొత్త ఉద్యోగులు అవసరమని కంపెనీ తెలిపింది.

Amazon to make one lakh new Appointments