Home తాజా వార్తలు హెచ్‌సిఎపై మంత్రికి ఫిర్యాదు

హెచ్‌సిఎపై మంత్రికి ఫిర్యాదు

Ambati Rayudu

 

హైదరాబాద్ : టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు HCA (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సిఎలో అవినీతి రాజ్యమేలుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సంఘంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ట్విటర్ వేదికగా కెటిఆర్‌కు ఫిర్యాదు చేశారు అంబటి రాయుడు. HCAలో అవినీతిని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రికెట్ పాలకుల్లో చాలా మందిపై ఎసిబి కేసులున్నాయని.. అలాంటి వారున్న చోట క్రికెట్ ఎలా ఎదుగుతుందని విమర్శలు గుప్పించారు. కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని కొన్ని రోజుల క్రితం ఆరోపణలు వినిపించాయి. ఇక ఇటీవలే జరిగిన HCA ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్యానెల్ విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఈ ఎన్నికల్లో HCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అజారుద్దీన్. ఇక ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న కారణంతో క్రికెట్ నుంచి తప్పుకొని మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు అంబటిరాయుడు.

Ambati Rayudu is outraged over HCA