Tuesday, April 16, 2024

గ్యాస్ ట్యాంకర్- అంబులెన్స్ ఢీ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Ambulance collision with Gas Tanker In Angul

భువనేశ్వర్: ఒడిశాలో అనుగుల్ జరపడలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గ్యాస్ ట్యాంకర్, అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్ లో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రిలో చేర్చారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సంబల్పూర్ నుండి అంబులెన్స్ భువనేశ్వర్ వైపు వెళుతుండగా జర్పాడా సమీపంలో ఈ విషాద సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

Ambulance collision with Gas Tanker In Angul

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News