Friday, January 27, 2023

90 రోజులు వీసాలు బంద్!

- Advertisement -

Donald-Trumpవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చే వారిపై ఆయన నిషేధం విధించారు. శరణార్థులను తగ్గించడం, ఎన్నికల ప్రచార సమయం నుంచి చెపుతున్నట్టుగానే అమెరికాలో రాడికల్ ఇస్లాం టెర్రరిజాన్ని తగ్గించడం కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు.. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ తొలిసారిగా ఆయన పెంటగాన్‌కు వెళ్లారు. అక్కడ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ జనరల్ జెమ్స్ మార్టిస్‌తో సమావేశమయ్యారు. అనంతరం శరణార్థుల నిషేధానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. అమెరికాలోకి రాడికల్ ఉగ్రవాదుల ప్రవేశాన్ని అడ్డకునేందుకు దేశంలో పటిష్టమైన బ్యాక్‌గ్రౌండ్ చెక్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
కాగా ట్రంప్ ఈ ఆర్డర్‌పై సంతకం చేయడంపై హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ది చాలా ప్రమాదకరమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం వలుసదారుల కోసం కొత్త నిబంధనలు రూపొందించేంత వరకు కొన్ని దేశాల పౌరలకు 90 రోజుల పాటు వీసాలు జారీ చేయరు. దీంతో ఇరాక్, సిరియా, ఇరాన్, సూడన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాల పౌరులకు వీసాలు నిలిపివేయనున్నారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే ధరఖాస్తుల్లోనూ ట్రంప్ ముందు క్రిస్టియన్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వారికి ఆశ్రయం ఇచ్చిన తర్వాతే ముస్లింల గురించి ఆలోచించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles