Tuesday, April 16, 2024

జూపార్క్ లో పులికి కరోనా

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్: కరోనా వైరస్‌తో అమెరికా గజగజ వణికిపోతుంది. కరోనాతో అమెరికాలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఎక్కడ చూసిన న్యూయార్క్ శవాల దిబ్బగా మారింది. ఒక్క అమెరికాలో కరోనా రోగుల సంఖ్య 3,36,851కు చేరుకోగా 9620 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా న్యూయార్క్‌లోని బ్రంగ్జ జూపార్క్‌లో ఉన్న పులిని కరోనా కాటేసింది. నదియా చెల్లి అనే పులికి కరోనా వైరస్ సోకిందని జూ పార్క్ సిబ్బంది వెల్లడించారు. పులికి ఆహారం అందించే వ్యక్తి నుంచి కరోనా సోకినట్టు సమాచారం. ఆ జూపార్క్‌లో పులితో పాటు మరో మూడు సింహాలు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నాయి. ప్రస్తుతం పులికి కరోనా టెస్టు చేశామని, పులి ఆరోగ్య సమాచారం అతి త్వరలో బయటపెడుతామని జూపార్క్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ ఒక్కోక్క జీవిపై ఒక్కో విధంగా ఉంటుందని తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాపిస్తుందనడంలో ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు వైరస్‌లు వ్యాపించిన సంఘటన ఎక్కడ జరగలేదని స్పష్టం చేశారు. కరోనా రోగులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచంలో కరోనా రోగులు సంఖ్య 12,78,383 చేరుకోగా 69,757 మంది చనిపోయారు.

 

America tiger tests positive for coronavirus in ZOO
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News