Home అంతర్జాతీయ వార్తలు భారత్ పై మరో ఉగ్రదాడి…

భారత్ పై మరో ఉగ్రదాడి…

america

వాషింగ్టన్‌: భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగిన పక్షంలో పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని  పాకిస్థాన్‌ను అమెరికా హెచ్చరించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ నిర్మాణాత్మక, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా జేషే మహ్మద్‌, లష్కరే తోయిబా సంస్థల కార్యకలాపాలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ కు సూచించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ఉగ్ర సంస్థలపై సరైన చర్యలు తీసుకోకుండా ఉండి, భారళత్‌పై మరో ఉగ్రదాడి జరిగితే అది పాకిస్థాన్‌కు చాలా ప్రమాదమని అధికారి హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు.

america warns pakistan