Thursday, April 25, 2024

ఫైజర్ కొనుగోళ్లను రెట్టింపు చేయనున్న అమెరికా

- Advertisement -
- Advertisement -

America will donate 100 crore doses to world

ప్రపంచానికి విరాళంగా 100 కోట్ల డోసులు

వాషింగ్టన్: కొవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ల కొనుగోళ్లను తమ దేశం రెట్టింపు చేస్తుందని అమెరికా అధికారులు తెలిపారు. దీనిపై అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన చేస్తారని వారన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా(యుఎన్ తదుపరి సమావేశాలకల్లా) ప్రపంచంలోని 70 శాతం మందికి వ్యాక్సిన్లను అందించాలన్న లక్షానికి మద్దతుగా తమ వంతు సాయంగా అమెరికా 100 కోట్ల డోసుల్ని విరాళంగా ఇవ్వనున్నది. ఇప్పటికే 16 కోట్ల డోసుల్ని ప్రపంచ దేశాలకు అమెరికా విరాళంగా అందించింది. ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన వ్యాక్సినేషన్‌లో ధనిక,పేద దేశాల మధ్య అసమానత్వం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థలు, దాతృత్వ సంస్థలు విమర్శిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 590 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. 43 శాతానికి అవి అందాయి. అయితే, కొన్ని దేశాల్లో అది 3 శాతం కూడా దాటలేదని దాతృత్వ సంస్థలు విమర్శిస్తున్నాయి. ధనిక దేశాలు తాము విరాళంగా ఇస్తామని చెప్పినదానిలో 15 శాతం మాత్రమే పూర్తి చేశాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూహెచ్‌ఒ) తెలిపింది. హామీలను వెంటనే నెరవేర్చి ఆఫ్రికాలాంటి పేద దేశాలకు సరఫరా చేయాలని సూచించింది. కొవాగ్జ్ పేరుతో ప్రపంచవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి చేపట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News