Tuesday, February 7, 2023

ట్రంప్ హుంకరింపు

  • ఆ ఏడు దేశాలనుంచి ప్రవేశాల నిషేధానికి మరో ఉత్తర్వు జారీ చేస్తానని ప్రకటన
- Advertisement -

trump-sadవాషింగ్టన్  : ఏడు ముస్లిం దేశాల వారి ప్రవేశంపై ఆంక్షల కు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాను వచ్చే వారం లోగా సరికొత్త కార్యనిర్వాహక ఆదేశాలను వెలువరించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ స్వయంగా తెలిపారు. ఏడు ముస్లిం దేశాల నుంచి శరణార్థులు, అక్కడి పౌరులు అమెరికాలోకి రాకుండా తాత్కాలిక నిషేధాలు ఖచ్చితంగా అమలు అయ్యేందుకు ఈ బ్రాండ్ న్యూ ఆదేశాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వివిధ న్యాయస్థానాల నుంచీ చివరికి అప్పీళ్ల కోర్టు నుంచీ కూడా తమ తొలి కార్య నిర్వాహక ఆదేశాలకు ఆటంకాలు ఏర్పడటంతో ట్రంప్ సరికొత్త ఆదేశాల దిశలో యోచిస్తున్నారు. అమెరికాలోకి రాకపోకల నిషేధపు ఉత్తర్వులను పునరుద్ధరించాలని ట్రంప్ అధికార యంత్రాంగం చేసుకున్న అభ్యర్థనను తాజాగా మరో అప్పీళ్ల కోర్టు తోసిపుచ్చింది. అయితే న్యాయపరంగా ఎదురవుతోన్న చిక్కుల నుంచి తాము బయటపడుతామని ట్రంప్ ఇప్పుడు దీమా వ్యక్తం చేశారు. తామే విజయం సాధిస్తామని, అయితే ఈ దిశలో కాలం గడిచిపోవడం బాధాకరం  అని, చివరికి గెలుపు తమదే అని ట్రంప్ చెప్పారు. అండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ స్థావరం నుంచి ఫ్లోరిడాకు ఎయిర్ ఫోర్స్ ఒన్ ప్రత్యేక విమానంలో వెళ్లుతూ ట్రంప్ తన వెంట ఉన్న విలేకరులతో మాట్లా డారు. సరికొత్త కార్యనిర్వాహక ఆదేశాలకు సమయం ఆసన్నమైందని, ఇది సమర్థవంతంగా ఉంటుందని, భద్రతాపరమైన కారణాలను తెలియచేసి, సరికొత్త ఆదేశాల దిశలో ముందుకు వెళ్లుతామని విమానంలో వెళ్లుతున్నప్పుడు ట్రంప్ చెప్పారు. 9వ యుఎస్ సర్కూట్ కోర్టు నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని, మరో వారం రోజులలో సరికొత్త ఆదేశాల దిశలో తమ అడుగులు ఉంటాయని వెల్లడించారు. బహుశా వచ్చే సోమ లేదా మంగళవారమే వీటిని తీసుకువచ్చేందుకు కూడా వీలుందని తెలిపారు. తాము తీసుకువచ్చే తాజా ఇమిగ్రేషన్ ఆదేశాలలో భద్రతా చర్యల ప్రస్తావన ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles