Thursday, April 25, 2024

జర్మనీ నుంచి అమెరికా సేనల విత్‌డ్రా

- Advertisement -
- Advertisement -

American troops withdraw from Germany

 

వాషింగ్టన్ : జర్మనీలో భారీ సంఖ్యలో అమెరికా బలగాలను తగ్గిస్తున్నట్లు దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం జర్మనీలో 34,500 మంది అమెరికా సైనికులు ఉన్నారు. అయితే దీనిని పాతికవేలకు తగ్గిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జర్మనీ అమెరికా పట్ల ధిక్కారధోరణిని ప్రదర్శిస్తోందని ట్రంప్ భావిస్తున్నారు. అక్కడ సేనల కుదింపు విషయాన్ని ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఈ నిర్ణయంపై నిరసనలు వ్యక్తం చేశారు. ఇది రష్యాకు ట్రంప్ కానుక అని , జాతీయ భద్రతకు భంగకరం అని విమర్శించారు. పూర్వపు సోవియట్ యూనియన్ దశలో జర్మనీ అమెరికా, నాటోలకు బలీయ మిత్రపక్షంగా ఉంది. సోవియట్ యూనియన్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు జర్మనీని కేంద్రీకృతం చేసుకుని అమెరికా పావులు కదిపింది. అయితే జర్మనీలోని తమ బలగాల పట్ల సరైన విధంగా వ్యవహరించడం లేదని ట్రంప్ మండిపడుతున్నారు. జర్మనీని తాము అన్ని సందర్భాల్లోనూ రక్షిస్తూ వస్తున్నామని, అయితే ఇందుకు ప్రతిగా వారి చర్యలు వేరే విధంగా ఉంటున్నాయని ట్రంప్ నిందించారు.

అయితే అమెరికాకు పలు సందర్భాలలో తమ దేశం సైనిక సౌకర్యాలకు వేదికగా నిలిచిందని, ప్రత్యేకించి గల్ఫ్ యుద్ధం సమయంలో అమెరికా బలగాలను పంపించడంలో తమ వంతు పాత్ర ఎక్కువగా ఉందని జర్మనీ వాదిస్తోంది. జర్మనీ ధోరణి బాగా లేదని , 2024 నాటికి దేశ స్థూల ఉత్పత్తిలో కనీసం 2 శాతం వరకూ రక్షణకు కేటాయించాలని తాము ఎన్నిసార్లు చెప్పినా జర్మనీ పట్టించుకోవడం లేదని ట్రంప్ విమర్శించారు. అయితే ఈ లక్షాన్ని తాము 2031నాటికి చేరుకుంటామని జర్మనీ చెపుతోంది. సేనల తగ్గింపు ప్రక్రియ నిర్థిష్టంగా జర్మనీని తప్పిదానికి తగ్గట్లుగా శిక్షించేందుకే అని ట్రంప్ తెలిపారు. అమెరికా సేనలు ఉండటం ఆయా దేశాల జాతీయ స్థానిక ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదం చేస్తుందని, దీనిని జర్మనీ పట్టించుకోవడం లేదని ట్రంప్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం జర్మనీలో అమెరికా సైనికులు 34500 మంది వరకూ ఉండగా , వారికి సహాయకంగా దాదాపు 175000 మంది రక్షణ విభాగం ఉద్యోగులు విధులలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News