Friday, March 29, 2024

అమిత్ పంగల్ పంచ్.. ఫ్రెంచ్ టోర్నీలో గోల్డ్ మెడల్..

- Advertisement -
- Advertisement -

నంటెస్: భారత బాక్సర్ అమిత్ పంగల్ తన సత్తా మరోసారి చాటాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న అలెక్సిస్ వాస్టైన్ ఇం టర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో అమిత్ గోల్డ్ మెడల్ సాధించాడు. జోర్డాన్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్ ట్రైనింగ్ ట్రయల్స్ తర్వాత.. కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న టోర్నమెంట్‌లో అమిత్ అదరగొట్టాడు. వరల్డ్ బాక్సింగ్‌లో సిల్వర్ మెడల్ కొట్టిన అమిత్.. అలెక్సిస్ ఈవెంట్‌లో దుమ్మురేపాడు. 52 కిలోల విభాగంలో అతను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అమిత్ పంచ్‌లకు అమెరికా బాక్సర్ తేలిపోయాడు. భారత్‌కు చెందిన మరో బాక్సర్ సంజీత్ కూడా 91 కిలోల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ క్రీడల్లోనూ మెడ ల్స్ సాధించిన అమిత్.. ఫైనల్లో అమెరికా బాక్సర్ రీనీ అబ్రహమ్‌ను 3-0 తేడాతో మట్టికరిపించాడు.

శుక్రవారం జరిగిన బౌట్‌లో అమిత్ దూకుడును ప్రదర్శించాడు. భారీ పంచ్‌లతో ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోకుండా చేశాడు. బాక్స ర్ సంజీత్ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫ్రెంచ్ బాక్సర్ సోహెబ్ బౌఫియాను ఓడించి గోల్డ్ మెడల్‌ను ఎగురేసుకుపోయాడు. టోక్యోలో జరగాల్సిన ఒలంపిక్స్‌కు 9 మంది బాక్సర్లు ఎంపికయ్యారు. కానీ, కోవిడ్ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలోని అసిసిలో భారత బాక్సర్లు 52 రోజుల శిక్షణ పొందుతున్నారు.

Amit Panghal won gold medal in French Open 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News