Home జాతీయ వార్తలు ప్ర‌ధానితో హోంమంత్రి భేటీ..

ప్ర‌ధానితో హోంమంత్రి భేటీ..

Amit Shah meet PM Modi at his residence in delhi

 

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్రమోడీతో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో సమావేశం అయ్యారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 ఈ నెల 31తో ముగియన్నుండగా.. లాక్ డౌన్ పొడిగింపు, కరోనా నియంత్రణ చర్చలపై చర్చ జరుగుతుంది. గురువారం రాత్రి పలు రాష్ట్రా ముఖ్యమంత్రులతో చర్చించిన అమిత్ షా తమ అభిప్రాయాలను కోరారు.

ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలో భారత్‌లో 7467 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు ఇన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడింది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే పలు అంశాలపై మోడీ, అమిత్ షా చర్చిస్తున్నట్టు సమాచారం.

Amit Shah meet PM Modi at his residence in delhi