Home జాతీయ వార్తలు కరోనాపై భారత్ పోరుకు యావత్ ప్రపంచం ప్రశంస

కరోనాపై భారత్ పోరుకు యావత్ ప్రపంచం ప్రశంస

Amit Shah participate in tree plantation in Gurugram

గురుగ్రామ్: ప్రపంచం మొత్తం మీద కరోనా పై విజయవంతంగా పోరాటం జరుగుతున్నది భారత్ లోనే అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. గురుగ్రామ్ లోని కేంద్ర సాయుధ పోలీస్ దళం(సిఆర్‌పిఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిఆర్‌పిఎఫ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెలాఖరుకు 1.37 కోట్ల మొక్కలను నాటాలని సిఆర్‌పిఎఫ్ లక్షంగా పెట్టుకుంది. 130కోట్ల మంది జనాభాతో అత్యంత జనసాంద్రత కలిగిన మనలాంటి దేశం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో అని చాలామంది అనుమానించారని, కానీ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యాన కరోనాపై పోరులో మనం విజయం సాధించామని ఆయన పేర్కొన్నారు.

ఉగ్రవాదుల పైనే కాకుండా కరోనాపై కూడా మనం తిరుగులేని పోరాటం సాగించగలమని నిరూపణ అయిందని, ఈ పోరులో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన అన్నారు. అమర జవాన్ల కుటుంబాలతో తాను మాట్లాడానని, వారందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని అమిత్‌షా చెప్పారు. కరోనాపై చేస్తున్న పోరు చరిత్రలో చిరస్థాయిగా నిల్చిపోతుందని, అలాగే జవాన్ల త్యాగం సువర్ణాక్షరాలతో లిఖిస్తారని ప్రశంసించారు.

Amit Shah participate in tree plantation in Gurugram