Home జాతీయ వార్తలు హైదరాబాద్‌పై అమిత్ షా నజర్

హైదరాబాద్‌పై అమిత్ షా నజర్

  • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే యోచన
  • రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి బజెపి పకడ్బందీ వ్యూహం

amit-shah

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కంచుకోటలో పాగా వేసేందుకు కాషాయ దళపతి అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా 2019 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయనే స్వయంగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమిత్ షా పోటీ చేయడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని ఊవి ళ్ళూరుతున్న బిజెపి క్యాడర్‌కు కూడా నూత నోత్తేజం నింపుతుందని అనుకుంటున్నారు. రాష్ట్ర బిజెపి నాయకులతో ఇటీవల జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఆమిత్ షా ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా 2014 ఎన్నికల్లో బిజెపి ప్రభంజనం వీచినప్పటికీ తెలంగాణలో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. మొదటి ను ంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి శతవి ధాలా ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఎంఐఎం తప్ప మరే పార్టీ హైదరాబాద్ నుంచి గెలవలేదనే అభిప్రాయానికి అన్ని పార్టీలు వచ్చే శాయి. మరోవైపు తెలంగాణలో అధికారంలో రావాలని లక్షంగా పెట్టుకు న్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు పని జరగడం లేదని స్పష్టమవుతోంది. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో దిట్టగా పేరు సంపాదించుకున్న అమిత్‌షా ఈ సారి తెలంగాణలో పాగా వేయడానికి వ్యూహం పన్నుతు న్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయాత్తం చేయడం కోసం ఇటీవల మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించిన బిజెపి గెలుపే ధ్యేయంగా పని చేసేందుకు చేపట్టాల్సిన వ్యూహంపై దశ, దిశను నిర్దే శించింది. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీస్తున్న తరుణంలో తెలంగా ణలో పార్టీ రోజురోజుకూ వెనక్కు వెళ్తుండటంపై కొంత కాలంగా అధిష్టానం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అవసరమైతే ప్రస్తుత నాయకత్వాన్ని పక్క కు పెట్టి కొత్త వారికి సారధ్య బాధ్యతలను అప్పగించేందుకు కూడా వెనక్కు తగ్గబోమన్న సంకేతాలను కూడా ఈ శిక్షణా శిబిరంలో అధిష్టానం సుస్ప ష్టంగా తెలియజేసింది.
7 న అమిత్‌షా రాక: హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని పోలింగ్ బూత్ కా ర్యకర్తల సమావేశానికి అమిత్‌షా హాజరుకానున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో మొత్తం 17 వేల పోలింగ్ బూత్‌లు ఉండగా, అందులో 800 పోలింగ్ బూత్‌లలో కమి టీలను ఏర్పాటు చేశామని, రానున్న రెండు, మూడు రోజులలో మరికొన్ని బూత్‌లలో కమిటీలను ఏర్పాటు చేయనున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు, ఎంఎల్‌సి ఎన్. రాంచందర్‌రావు సమన్వయకర్తగా వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 6 నుంచి అంబేద్కర్ జయంతి 14 వ తేదీ వరకు దేశ వ్యా ప్తంగా సమరసత వారోత్సవాలను నిర్వహిస్తున్నందున రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలో సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. నిజామాబాద్‌కు నితిన్ గడ్కరి, భువనగిరికి ప్రకాష్ జావదేకర్, మహబూబ్‌నగర్ అనంతకుమార్, కరీంనగర్ పురుషోత్తం రూపాలా, వరంగల్ పల్లు రాధాకృష్ణ, మెదక్ హరిబా బు, మల్కాజిగిరి మురళీధర్‌రావు, సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ తదితరులు హాజరవుతారన్నారు. మిగతా నియోజకవర్గాలకు కూడా కేంద్ర పార్టీ నేతలు హాజరవుతారని లక్ష్మణ్ తెలిపారు.