Home జాతీయ వార్తలు నిన్ను చూసి దేశం గర్విస్తోంది: అమిత్ షా

నిన్ను చూసి దేశం గర్విస్తోంది: అమిత్ షా

Amit Shah

 

శ్రీనగర్: తీవ్రవాదుల కాల్పుల్లో అమరుడైన ఇన్‌స్పెక్టర్ అర్షద్ ఖాన్ కుటుంబాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు దేశం ప్రజలు తోడుగా ఉంటారని ధైర్యం చెప్పారు. అర్షద్ ఖాన్ దేశం కోసం ప్రాణాలు విడిచిన గొప్ప వీరుడని పొగిడారు. తాను మరణిస్తూ కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడారని అమిత్ ప్రశంసించారు. జూన్-12న అనంత్ నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అర్షద్ ఖాన్‌తో పాటు ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో అర్షద్ ఖాన్ తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అర్షద్ ఖాన్‌కు ఇద్దరు కుమారులు, భార్య, తమ్ముడు ఉన్నారు.  గొప్ప వీరుడుని కోల్పోయిందని జమ్ము కశ్మీర్ పోలీస్ విభాగం సంతాపం తెలిపింది. అంతిమ యాత్రలో అర్షద్ కుమారులు రోదన చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జమ్ము కశ్మీర్‌లో భద్రతపై అధికారులతో అమిత్ షా సమావేశమయ్యారు. జమ్ము అభివృద్ధిపై స్థానిక బిజెపి నేతలు, గవర్నర్‌ సత్యపాల్ మాలిక్ తో  సమావేశమయ్యారు.

 

Amit Shah Visits Martyr Arshad Khan’s family

 

 

Amit Shah Visits Martyr Arshad Khan’s family