Home తాజా వార్తలు బిగ్ బీకి కరోనా

బిగ్ బీకి కరోనా

Amitabh and Son Abhishek were admitted to hospital

 

ముంబయి నానావతి ఆసుపత్రిలో చేరిక
కుటుంబసభ్యులకూ పరీక్షలు, ఫలితాల కోసం వెయిటింగ్

ముంబై : ప్రముఖ బాలివుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్‌కు కరోనా పాజిటివ్ సోకింది. ముంబై లోని నానావతి ఆస్పత్రికి ఆయనను తరలించారు. “నాకు కరోనా పాజిటివ్ కనిపించింది. ఆస్పత్రికి తరలించారు. కుటుం బం, పరివారం పరీక్షలు చేయించుకుంటున్నారు. ఫలితాల కోసం నిరీక్షిస్తున్నాం. నాతో గత పది రోజులుగా సన్నిహితంగా ఉన్నవారంతా తమంత తాము పరీక్షించుకోవడం మంచిది ” అని అమితాబ్ ట్విట్టర్‌లో తెలియచేశారు. ముంబై జుహు ఏరియాలో ఉన్న అమితామ్ ఇంటికి చాలా దగ్గరలో ముంబై విల్లే పార్లేలో నానావతి ఆస్పత్రి ఉంది. దేశంలో కరోనా వ్యాపించక ముందు షూజిత్ సర్కార్ కామెడీ డ్రామా గులాబో సితాబోలో అమితాబ్ నటులు ఆయుష్మాన్ ఖురానాతో కలసి నటించారు. ఆ చిత్రం ఇంకా థియేటర్లకు విడుదల కాలేదు. విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలో కరోనా వ్యాపించింది.

Amitabh and Son Abhishek were admitted to hospital