Home దునియా బాలీవుడ్ షెహన్‌షా

బాలీవుడ్ షెహన్‌షా

 

దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్. బాలీవుడ్ షెహెన్ షా. ‘లాక్ కర్ దే’ అంటూ బుల్లితెరపై కోటీశ్వరులను తయారుచేసే పని మొదలుపెట్టాడు. అక్కడా సక్సెస్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఇపుడు తెలుగులో సైరా..నరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించాడు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్.. తాజాగా కేంద్రం బిగ్‌బీని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది.

* 1969లో ‘సాత్ హిందుస్థానీ’తో మొదలైన ఆయన నట ప్రస్థానం రాబోయే ‘సైరా నరసింహారెడ్డి’ వరకు కొనసాగుతూనే ఉంది.
* అమితాబ్ 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగలో జన్మించారు.
* తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి. తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన సిక్కు మహిళ.
* తల్లిదండ్రులు మొదట పెట్టిన పేరు ‘ఇంక్విలాబ్’ . ఆ తర్వాత ‘ఎన్నటికీ ఆరని దీపం’ అని అర్ధం వచ్చేలా.. అమితాబ్ అని మార్చారు.
* తండ్రి కలం పేరైన బచ్చన్‌ను ఇంటి పేరుగా మార్చుకున్నారు.
* నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు, మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నా రు.
* చదువు: ఆర్ట్‌లో రెండు పీజీలు చేశారు. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన కిరోరిమల్ కాలేజ్‌లో బీఎస్సీ చేశారు.
* మొదటి ఉద్యోగం: కలకత్తాలోని ‘బర్డ్ అండ్ కో’ అనే షిప్పింగ్ కంపెనీలో మెటీరియల్ బ్రోకర్‌గా పనిచేస్తూ.. సినిమా వేషాల కోసం ప్రయత్నించాడు. 20వ ఏట ఉద్యోగం వదిలి, ముంబై చేరాడు.
* ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ‘షోలే’ లో హీరోగా నటించిన బిగ్‌బీ…ఆ మూవీ రీమేక్ ‘ఆగ్’లో విలన్‌గానూ నటించి కొత్త రికార్డు క్రియేట్ చేసారు.
90 దశకం చివర్లో వచ్చిన ‘మృత్యుదాత’ సినిమాతో అమితాబ్ తన రెండో ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టారు. అప్పటి నుంచే అమితాబ్ బిగ్‌బీగా పేరుపొందారు.
* ఆ తర్వాత ఏబీసీ కార్పొరేషన్ స్థాపించి విఫలమైనప్పుడు ‘అమితాబ్ పని అయిపోయింది’ అన్నారందరూ.
* అప్పులపాలై ఆఖరికి ఇల్లు తాకట్టు పెట్టాల్సిన స్థితిలో పడిపోయారు అమితాబ్. తిరిగి పుంజుకున్నప్పుడు గుర్తుపెట్టుకుని మరీ అందరి బాకీలను చెల్లించిన క్రమశిక్షణ, నిబద్ధత అమితాబ్‌కే సొంతం.
* 2000 సంవత్సరంలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షో టెలివిజన్ చరిత్రలో సంచలనం.
* ఎన్నో సినిమాల్లో మద్యం తాగుతూ కనిపించిన అమితాబ్ నిజజీవితంలో అసలు మద్యం తీసుకోరు. పూర్తి శాకాహారి కూడా. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడే అమితాబ్ రెండు చేతులతోనూ రాయగలరు.
* సామాజిక అనుసంధాన వేదికల్లో నేటితరం కథనాయకులెవరూ అమితాబ్‌కు సాటిరారు. అంతలా మిలియన్ల కొద్దీ అభిమానులున్నారు బిగ్‌బీకు.
* మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి ఆసియా నటుడు అమితాబ్.
* 2001 ఈజిప్టులో జరిగిన అలెగ్జాండ్రియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమితాబ్‌ని ‘యాక్టర్ ఆఫ్ ది సెంచరీ’ పురస్కారంతో గౌరవించారు.
* ఒలింపిక్ జ్యోతిని అందుకునే అరుదైన గౌరవం అమితాబ్‌కి లభించింది.
* 2015లో భారత ప్రభుత్వం అమితాబ్‌ని పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అక్కినేని తర్వాత మూడు పద్మ పురస్కారాలు అందుకున్న రెండో భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్.
* ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారం ‘ది నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’ అందుకొన్న నటుడు అమితాబ్.
*బాలీవుడ్‌లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన నటుడు  కూడా అమితాబే.