Home తాజా వార్తలు పని తగ్గించుకోవాలని డాక్టర్లు చెప్పారు : బిగ్ బి

పని తగ్గించుకోవాలని డాక్టర్లు చెప్పారు : బిగ్ బి

Amitabh-Bachchan

ముంబై : మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ హిందీ చిత్రరంగంలో ప్రవేశించి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. అయినా బాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగానే ఉంటూ నటిస్తున్నారు. అయితే గురువారం తన ఆరోగ్య విశేషాలను తన అభిమానులతో పంచుకున్నారు. డాక్టర్లు తనను పనిబాగా తగ్గించుకోవాలని సలహా ఇచ్చినా తానింకా పని లోనే నలుగుతున్నట్టు వెల్లడించారు. బచ్చన్ మొదటి సినిమా సాత్‌హిందుస్థానీ 1969 నవంబర్ 7 న విడుదలైంది. ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినా తరువాత వచ్చిన సినిమాలు సూపర్‌స్టార్ యుగాన్ని సృష్టించాయి. గత అయిదు దశాబ్దాల్లో ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. 77 ఏళ్ల బచ్చన్ ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. కౌన్‌బనేగా క్రోరోపతి కార్యక్రమం ద్వారా నిత్యం బిజీగా ఉండడంతోపాటు ఝుంద్, చెహ్రే, గులాబో సితాబో బ్రహ్మాస్ట్ర వంటి కార్యక్రమాల్లో కూడా కనిపిస్తున్నారు.

Amitabh Bachchan Shares An Update About His Health